Tuesday, 20 October 2026
Header1
BREAKING

ప్రభుత్వ స్కూల్ ముద్దు...ప్రైవేట్ స్కూల్ వద్దు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 01 Oct 2026, 06:13 PM
🔄 నవీకరణ: 08 Oct 2026, 10:47 AM
👁️ 18 views
Story Highlights

...ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల సహకారం అవసరం...మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు

మాచర్ల అక్టోబర్  01  రాజధాని వాయిస్ :

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారం అందించాలని మాచర్ల మార్కెట్‌ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు.మాచర్ల పట్టణంలోని నెహ్రూనగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విద్యార్థుల త్రాగు నీటి సౌకర్యార్థం యాగంటి మల్లిఖార్జునరావు ఏర్పాటు చేసిన త్రాగునీటి ట్యాంకును ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అభినందించింది.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతకంతో ప్రభుత్వం తరఫున అందించిన ప్రశంసాపత్రాన్ని పాఠశాల హెచ్‌ఎం కేశవరెడ్డి, ఉపాధ్యాయులు ఏడుకొండలు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి యాగంటి మల్లిఖార్జునరావు కు అందజేసి ఘనంగా సత్కరించారు.
WhatsApp Image 2026-10-01 at 12.25.34 PM.jpeg
ఈ సందర్భంగా యాగంటి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... సమాజంలో పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి విద్యే ప్రధాన మార్గమని అన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టిందని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూ, సాక్సులతో పాటు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని యాగంటి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధనపై దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధులను తొలగించి,వారిని విద్యాబోధనకే పరిమితం చేయడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, విద్యా విధానాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతోందని, గతంతో పోలిస్తే సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.
పాఠశాలల్లో చిన్నచిన్న మౌలిక వసతుల కల్పనకు ప్రతిసారీ ప్రభుత్వంపై ఆధారపడకుండా తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారం అందించాలని యాగంటి కోరారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందితే భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్, ఉక్కు, సిమెంట్ తదితర రంగాల్లో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని యాగంటి మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X