మాచర్ల: అక్టోబర్ 01 రాజధాని వాయిస్ :
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం మాచర్ల పట్టణంలోని 15వ వార్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని వార్డులోని అవ్వాతాతలకు స్వయంగా పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో వృద్ధులు, పింఛన్‌దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి రూ.4,000 పింఛన్‌ను గౌరవంగా ఇంటి వద్దకే అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.
పింఛన్ అందుకున్న అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, యాగంటి మల్లికార్జునరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు.
అనంతరం యాగంటి మల్లికార్జునరావు వార్డులోని ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 15వ వార్డు కూటమి నాయకులు, బూత్ ఇన్‌చార్జులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!