Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఆటోనగర్ లో పర్యటించిన కలెక్టర్, ఎం.ఎల్.ఏ

- ఆటోనగర్ అభివృద్ధికి చర్యలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 గుంటూరు
📅 ప్రచురణ: 10 Oct 2026, 04:20 PM
🔄 నవీకరణ: 18 Oct 2026, 09:05 AM
👁️ 16 views

గుంటూరు, అక్టోబర్ 10 : రాజధాని వాయిస్ :

గుంటూరు ఆటోనగర్ లో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ , గుంటూరు (తూర్పు) శాసన సభ్యులు నసీర్ అహ్మద్ శనివారం పర్యటించారు. ఆటోనగర్లో వసతులు, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధికి దశలవారీగా చర్యలు చేపడతామని చెప్పారు. రూ. 30 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని అన్నారు. ఆటోనగర్లో పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్మాణం వంటి అవసరాలను గుర్తించామని తెలిపారు. అచ్యుత ఉన్న తుక్కు (స్క్రాప్) మరో ప్రాంతానికి ప్రదేశానికి తరలించుటకు అవకాశాలు పరిశీలిస్తున్నామని అన్నారు. అదేవిధంగా అవసరం లేని పరికరాలను రోజువారి తరలించుటకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో గుర్తిస్తామని చెప్పారు. గుంటూరు నగరంలో చక్కటి ఆటోనగర్ ఏర్పాటు జరుగుటకు, అందరి అవసరాలు తీర్చే విధంగా ఉండాలని భావిస్తున్నామని అన్నారు. మంచి ఆటోనగర్ ఏర్పాటు వలన ఉపాధి అవకాశాలు కూడా పెంపొందగలరని ఆశ భావం వ్యక్తం చేశారు.

శాసన సభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ చక్కటి రహదారులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, గుంటూరు నగరపాలక సంస్థ కార్యనిర్వహక ఇంజనీర్ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X