Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండ సీఎం సహాయనిధి: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 నరసరావుపేట
📅 ప్రచురణ: 27 Sep 2026, 04:42 PM
🔄 నవీకరణ: 28 Sep 2026, 11:22 PM
👁️ 3 views


నరసరావుపేట: సెప్టెంబర్ 27 రాజధాని వాయిస్ :

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 72 మంది లబ్ధిదారులకు రూ.63.45 లక్షల విలువైన CMRF చెక్కులను ఆయన అందజేశారు. అలాగే అత్యవసర వైద్య చికిత్స అవసరమైన మరో 16 మంది రోగులకు రూ.29.39 లక్షల విలువైన ఎల్వోసీ (LOC) పత్రాలను సైతం అందజేసినట్లు వివరించారు.
WhatsApp Image 2026-09-27 at 4.30.55 PM.jpeg
కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన తనకు తెలుసని, అలాంటి క్లిష్ట సమయంలో బాధితులకు 'మేమున్నాం' అనే భరోసాతో ఆర్థిక చేయూతనివ్వడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎంపీ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, అత్యవసర వైద్య సాయం సకాలంలో చేరేలా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X