Tuesday, 20 October 2026
Header1
BREAKING

248 మందికి రూ.1.92 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అద్దంకి
📅 ప్రచురణ: 14 Oct 2026, 05:55 PM
🔄 నవీకరణ: 15 Oct 2026, 05:50 AM
👁️ 15 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

- పేదలకు వైద్యం భారం కాకూడదన్న‌దే ముఖ్య‌మంత్రి ఉద్దేశం - కష్టకాలంలో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధితో కొండంత భరోసా - ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్


అద్దంకి - ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ పేద కుటుంబానికీ వైద్యం దూరం కాకూడదన్న‌దే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉద్దేశ‌మ‌ని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్ద‌కి ఆర్డీఓ కార్యాల‌యంలో బుధ‌వారంనాడు 248 మంది ల‌బ్ధిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీల‌ను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. మొత్తం రూ.1,92,08,459., విలువైన 217 సీఎంఆర్ఎఫ్, 31 ఎల్ఓసీ ల‌ను ఆయ‌న అంద‌జేశారు. అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం నుంచి అందే సాయం బాధిత కుటుంబాలకు కొండంత ధైర్యాన్నిస్తుందని ఆయ‌న‌ చెప్పారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.., వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్యం అవసరమైన వారికి సకాలంలో చికిత్స అందించడంలో ఎల్‌ఓసీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. మెరుగైన వైద్యం చేయించుకోవ‌డానికి ఆర్థిక ప‌రిస్థితులు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో అర్హులైన వారికి సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల‌ ద్వారా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం సహాయం అందిస్తోందన్నారు. అనుకోని అనారోగ్యంతో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు ల‌బ్ధిదారుల‌కు ఆసరాగా నిలుస్తున్నాయ‌ని ఆయ‌న‌ చెప్పారు.

*గ్రీవెన్స్ తో ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.....*

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి గొట్టిపాటి.., అద్దంకి ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయ‌న‌ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చ‌ర్చించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి తావివ్వకుండా బాధ్యతతో వ్యవహరించాలని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో కూట‌మి నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X