జాతీయ నాయకులకు ఘన నివాళులు అర్పించిన కె.ఎన్.ఆర్ విద్యాసంస్థలు
రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, రాజుపాలెం మండలం కొండమోడు కె.ఎన్.ఆర్ విద్యాసంస్థలనందు జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన కళాశాల డైరెక్టర్ కోనేటి నరసింహారావు, బాడిస మస్తాన్ రావు.ఈ సందర్బంగా మాట్లాడుతూ అక్టోబర్ 2న భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజని, ఎం మహాత్మా గాంధీ జయంతి, మాజీ ప్రధానమంత్రి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా,ఈ ఇద్దరు మహనీయులు వేర్వేరు రంగాల్లో దేశానికి సేవ చేసినప్పటికీ, వారి జీవితాల్లో మనకు కనిపించే ప్రధాన లక్షణాలు సత్యం, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, దేశభక్తి మరియు సేవాభావం. దేశానికి కేవలం చదువుకున్న యువత మాత్రమే కాదు, బాధ్యతా యుతమైన యువత అవసరం.అవినీతిని ప్రశ్నించే ధైర్యం, సమాజంలోని సమస్యలను అర్థం చేసుకునే ఆలోచన, మహిళలను గౌరవించే సంస్కారం, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత, దేశ ఐక్యతను కాపాడే నిబద్ధత యువతలో ఉండాలి.
మహాత్మా గాంధీ మనకు సత్యాగ్రహ మార్గాన్ని చూపిస్తే, లాల్ బహదూర్ శాస్త్రిబాధ్యతా యుతమైన నాయకత్వానికి ఆదర్శనీయులు అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు చిన్నబోయిన శ్రీనివాసరావు, సాధినేని నరసింహారావు, తెలకపల్లి గోపికృష్ణ, దీపంగి సురేష్, వంగివరపు రాజా, జె.వీరాంజనేయులు,కోనేటి ప్రసన్న, బి.ఇందుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!