నరసరావుపేట.
పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, ఆదేశాల మేరకు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి సత్తెనపల్లి రూరల్, క్రోసూరు మండలాల పరిధిలోని , ధూళిపాళ్ల , అందుకూరు గ్రామాలలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.* విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఎన్నికల సమయంలో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చే అభ్యర్థులు, ప్రతిపాదకులు ఎన్నికల నియమావళిని (Model Code of Conduct) ఖచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు.:
డ్రోన్ కెమెరాలు & సీసీటీవీ నిఘా
నామినేషన్ కేంద్రాలు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలు (Drone Cameras) మరియు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
బాడీ వార్న్ కెమెరాల (Body Worn Cameras) వినియోగం
విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని, తద్వారా ప్రతి సంఘటన రికార్డ్ అవుతుందని మరియు విధుల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉంటుందని స్పష్టం చేశారు.
* 100 మీటర్ల నిబంధన అమలు:
నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి అనధికార వ్యక్తులు, వాహనాలు మరియు గుంపులు రాకుండా కట్టుదిట్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అభ్యర్థితో పాటు కేవలం అనుమతించబడిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, మొబైల్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక శక్తులు గొడవలకు ప్రేరేపించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా లేదా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా తక్షణమే గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు మరియు రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి డి.ఎస్.పి చైతన్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!