గురజాల అక్టోబర్ 08 రాజధాని వాయిస్ :
తిరువూరు, ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ బెంచ్‌ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో కత్తి జ్యోతిబాబు బంగారు పతకం సాధించారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కత్తి కార్తిక్ కూడా గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటాడు. అంతేకాకుండా ఏపీ సబ్‌జూనియర్ విభాగంలో ‘స్ట్రాంగ్ బాయ్’ టైటిల్ను కైవసం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందాడు.
అదేవిధంగా జ్యోతిబాబు కుమార్తె కత్తి పల్లవి కూడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. సబ్‌జూనియర్ విభాగంలో ‘ఏపీ స్ట్రాంగ్ గర్ల్’ టైటిల్ను కైవసం చేసుకుని సత్తా చాటింది.
తండ్రి జ్యోతిబాబు స్వయంగా కోచింగ్ ఇస్తూ తన పిల్లలను క్రీడారంగంలో ప్రోత్సహించడం, ఒకే కుటుంబం నుంచి తండ్రి, కుమారుడు, కుమార్తె రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించడం క్రీడాభిమానులను ఆకట్టుకుంది. క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదలతో ముందుకు సాగితే క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఈ కుటుంబం విజయాలు చాటుతున్నాయి.
తండ్రి శిక్షణ.. పిల్లల ప్రతిభ.. మూడు గోల్డ్ మెడల్స్.. రెండు ప్రతిష్ఠాత్మక టైటిళ్లు సాధించి కత్తి కుటుంబం పవర్‌లిఫ్టింగ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. విజేతలను పలువురు క్రీడాభిమానులు, కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.
Be the first to share your thoughts on this story!