గుంటూరు, అక్టోబర్ 8 : రాజధాని వాయిస్
2026 ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా, 2026 జూన్ 15 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారన్నారు. మరణం, శాశ్వత నివాస మార్పు, బహుళ నమోదులు, చిరునామాలో లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఓటర్లు వారు ఇచ్చిన చిరునామాలలో లేరని ఈ సర్వేలో బూత్ స్థాయి అధికారులు గుర్తించిన విషయం విదితమేనని అన్నారు. ఇంటింటి సర్వే ఆధారంగా మరణించిన, స్థలం మారిన, బహుళ నమోదులు కలిగిన ఓటర్ల పేర్లను తొలగించిన తర్వాత, 2026 జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందని తెలిపారు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత నోటీసు దశలో, 2026 అక్టోబర్ 6 నాటికి ప్రచురించబోయే తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి వీల్లేని ఓటర్లను అనర్హులుగా గుర్తిండం జరిగిందన్నారు. రాష్ట్రంలో 2026 ప్రత్యేక సమగ్ర సవరణ కింద 2026 అక్టోబరు 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల నమోదుకు జనవరి 1, ఏప్రిల్ 1, జులై, అక్టోబర్ అనే నాలుగు అర్హత తేదీలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే సంవత్సరం జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి వార్షిక సంక్షిప్త సవరణను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2026 అక్టోబరు 16వ తేదీన ప్రచురించే తుది జాబితాలో పేరు లేని వారు, పొరపాటున వదిలివేయబడినవారు లేదా తదుపరి అర్హత తేదీల నాటికి అర్హత పొందే ఏ వ్యక్తి అయినా సరే నిరంతర నవీకరణ ప్రక్రియలో భాగంగా తమ పేరు నమోదు కోసం ఫారం-6 ను సమర్పించవచ్చని వివరించారు.
Be the first to share your thoughts on this story!