టిఫిన్ చేస్తూ కానిస్టేబుల్ లతో పలు అంశాలపై చర్చించిన మంత్రి.
నక్కపల్లి, సెప్టెంబర్ 25:- రాజధాని వాయిస్ :
విధి నిర్వహణలో పోలీసు.. క్రీడా ప్రాంగణంలో క్రీడాకారిణి.. పరుగుల బరిలో దిగితే పతకం సాధించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పాయకరావుపేట పోలీసుస్టేషన్ మహిళా కానిస్టేబుల్ వి. విజయ. తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీసు విధులను సమర్థంగా నిర్వహిస్తూనే క్రీడల్లోనూ సత్తా చాటుతున్న విజయ..ఇటీవల అమరావతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం ఆరు విభాగాల్లో పాల్గొని బంగారు పతకాలను సాధించారు. 5 వేల మీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్ల పరుగుతో పాటు 400×4 మీటర్ల రిలేలోనూ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఖోఖో, కబడ్డీ పోటీల్లోనూ విజయ ప్రాతినిధ్యం వహించిన జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి.
దీంతో ఆయా విభాగాల్లోనూ ఆమె బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ విజయ సాధించిన ఈ విజయాలు పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచాయి. ఈ సందర్భంగా నక్కపల్లి మండలంలోని తన నివాసం వద్ద కానిస్టేబుల్ తో హోం మంత్రి అనిత టిఫిన్ చేస్తూ, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా కానిస్టేబుల్ విజయను ఘనంగా సత్కరించి అభినందించారు. క్రీడల్లో విజయ సాధించిన పతకాల వివరాలను తెలుసుకుని ప్రత్యేకంగా ప్రశంసించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పలువురికి విజయ స్ఫూర్తిగా నిలుస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే పాయకరావుపేట పోలీస్ పరిధిలో పలు కేసులు దర్యాప్తులో కీలకపాత్ర వహించడమే కాకుండా, సాంకేతికంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న కానిస్టేబుల్ రాంబాబును కూడా హోం మంత్రి అనిత సత్కరించారు. అవయవ దానం చేసిన నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీనివాసురావును హోం మంత్రి అనిత అభినందించారు.

Be the first to share your thoughts on this story!