Tuesday, 20 October 2026
Header1
BREAKING

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ కరీమూన్ నామినేషన్ దాఖలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 17 Oct 2026, 04:53 PM
🔄 నవీకరణ: 19 Oct 2026, 06:22 PM
👁️ 33 views
చిలకలూరిపేట. అక్టోబర్ 17 రాజధాని వాయిస్ :

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ కరీమూన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా షేక్ కరీమూన్ మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన తనపై నమ్మకం ఉంచి, చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన మాజీ మంత్రి విడదల రజిని కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, చిలకలూరిపేట పట్టణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం, అన్ని వర్గాల సంక్షేమం తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు షేక్ కరీమూన్ కి తమ మద్దతు తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X