*ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136 వ వర్ధంతి* .
రాజధాని వాయిస్,సత్తెనపల్లి:
పట్టణంలోని తాలూకా సెంటర్ లో మహాత్మ జ్యోతిబా పూలే 136వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘ నాయకులు మల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన మహిళలు, అణగారిన కులాల ప్రజలకి విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నిమ్న కులాల ప్రజలకి సమాన హక్కులు సాధించడానికి సత్యశోదక్ ను స్థాపించాడన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తిరుమలపల్లి కోటి మాస్టర్, చింకా అంకమ్మరావు, కుమ్మరి దస్తగిరి, పిక్కిల రత్తయ్య, పల్లపు ధర్మారావు, పులహరి బానోజీ, షేక్ చిన్న షరీఫ్ ,పిల్లుట్ల ఆంజనేయులు, మంగళ పూరి నాగేశ్వరావు, విప్పర్ల కొండలు, క్యాలిబర్ జానీ ,తేటనీల్ల అప్పయ్య, వీరాటం సైదారావు, గుంటూరు గోవిందు, చావల వెంకటేశ్వర్లు,పిక్కిలి శివ తదితరు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!