నవంబర్, 05:- రాజధాని వాయిస్ :
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 209వ పోలింగ్ బూత్‌లో సాధారణ ఓటరుగా క్యూలైన్‌లో నిలబడి ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం హోంమంత్రి అనిత ఉపమాక గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
Be the first to share your thoughts on this story!