Thursday, 27 August 2026
Telugu Daily
Header
BREAKING

మీ ఓటు–మీ హక్కు..

అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి అక్కయ్య బుట్టి

మాచర్ల.
ఆగస్టు 25
రాజధాని వాయిస్

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు అక్కయ్య బుట్టి పిలుపునిచ్చారు.
మీ ఓటు–మీ హక్కుఅని పేర్కొంటూ,ఓటు హక్కు పొందడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని ఆయన తెలిపారు.కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని,2008 అక్టోబర్ 1వ తేదీ లేదా అంతకుముందు జన్మించిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని అక్కయ్య బుట్టి తెలిపారు.అర్హత కలిగిన యువత,ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటరు నమోదుకు ఆధార్ కార్డు,జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి సర్టిఫికెట్,రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
సమీపంలోని గ్రామ,వార్డు సచివాలయం,మీ-సేవ కేంద్రం ద్వారా లేదా ఆన్‌లైన్‌లో
(ఎన్ విఎస్) పి సేవలను ఉపయోగించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.2026 ఆగస్టు 31వ తేదీని ఆఖరి తేదీగానిర్ణయించినందున,అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని అక్కయ్య బుట్టి కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైన హక్కు అని,ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగబద్ధ పాలనకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!