ఇరుముడి సినిమాలో మెరిసిన డప్పు శ్రీను పాట
కళాకారులు డప్పు శ్రీను, సుంకర ఆంజనేయులకు ఘన సన్మానం
నరసరావుపేట. ఆగస్టు 24
రాజధాని వాయిస్ :
సినీ కథానాయకుడు రవితేజ నటించిన ఇరుముడి చిత్రంలో పాట, డప్పు కళతో ప్రతిభ కనబరిచిన నరసరావుపేటకు చెందిన డప్పు శ్రీను,పాటకు సంగీతం అందించిన సుంకర ఆంజనేయులును సోమవారం మధ్యాహ్నం రామిరెడ్డి పేటలో మానవ సేవ, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, ఎంఐఎం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ కళలకు, జానపద సాంప్రదాయాలకు డప్పు కళ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అటువంటి కళను నమ్ముకుని ముందుకు సాగుతూ సినీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అభినందనీయమన్నారు. కళాకారులను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడమేనని డప్పు శ్రీను తన కళతో నరసరావుపేటకు మంచి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమన్నారు. సుంకర ఆంజనేయులు సంగీత రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, న్యాయవాది వంకాయలపాటి రవి, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పి. కృష్ణకుమారి, లతో పాటు పలువురు కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments