బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి
చీరాల, అక్టోబర్ 22: ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,పేర్కొన్నారు.
ఈ నెల 28 న జరగనున్న చీరాల మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం చీరాల మున్సిపాలిటీ పరిధిలోని జయంతిపేటలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 41, 43 నంబర్ల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఓటర్లు సులభంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు,ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లు జాబితా ను డిస్ప్లే చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి కల్పించే సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం,మరుగుదొడ్లు, ఓటర్ల రాకపోకలకు అనుకూలమైన మార్గాలు, దివ్యాంగ ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు.
అనంతరం చీరాల మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయం, పోలింగ్ కేంద్రాల వారీగా నిర్వహణ సన్నద్ధత తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసఫ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!