Wednesday, 21 October 2026
Header1
BREAKING

స్థానిక ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లను సంయుక్తంగా పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Oct 2026, 04:23 PM
👁️ 8 views


పల్నాడు జిల్లా:రాజధాని వాయిస్ :

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా గారు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీశ్ అదహళ్లి గారు ఈరోజు సంయుక్తంగా స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించి పరిశీలించారు.

WhatsApp Image 2026-10-21 at 3.53.37 PM.jpeg

ఈ సందర్భంగా JNTU, AM Reddy ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను వారు పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు తదితర అంశాలను సమీక్షించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులకు సూచించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X