*నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి కోట చంద్రశేఖర్ కృషి*
*కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం*
*సంక్షేమ పథకాలను వివరిస్తూ నాయి బ్రాహ్మణుల్లో చైతన్యం*
*బొజ్జల సుధీర్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి సహకారం*
*శ్రీకాళహస్తి*
నాయి బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా నాయి బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ చేస్తున్న కృషికి నాయి బ్రాహ్మణ వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాయి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. వారి హక్కులు, అవకాశాలపై అవగాహన కల్పిస్తూ కోట చంద్రశేఖర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
నాయి బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణులు రాజకీయంగా బలోపేతం కావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి నాయి బ్రాహ్మణ కుటుంబానికి చేరేలా అవగాహన కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
*తొట్టంబేడులో కూటమికి మద్దతు*
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొట్టంబేడు మండలంలో కూటమి అభ్యర్థుల విజయానికి నాయి బ్రాహ్మణుల మద్దతు కూడగట్టేందుకు కోట చంద్రశేఖర్ కృషి చేస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థి రావెళ్ల మునిరాజా నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన నాయి బ్రాహ్మణులను కోరారు. గ్రామస్థాయిలో కూటమి బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
*బొజ్జల నాయకత్వానికి అండగా..*
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వానికి నాయి బ్రాహ్మణులు అండగా నిలవాలని కోరారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నాయి బ్రాహ్మణుల ఐక్యత, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని కోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నాయి బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే తన ధ్యేయమని తెలిపారు.
Be the first to share your thoughts on this story!