Monday, 02 November 2026
Header1
BREAKING

వర్షంలోనూ ప్రజల మధ్య హోంమంత్రి అనిత..

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 02 Nov 2026, 02:38 PM
👁️ 10 views


*పాయకరావుపేట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*పాయకరావుపేట పట్టణంలో 7వ సెగ్మెంట్‌లో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం*

*డ్రైనేజీ వ్యవస్థ, రామాలయం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ*

పాయకరావుపేట.

 నవంబర్ 02


 స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాయకరావుపేట పట్టణంలోని 7వ సెగ్మెంట్‌లో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్న మంత్రి, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానికులు హోంమంత్రి అనితకు ఘన స్వాగతం పలికారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారానికి తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. పాయకరావుపేటలో నాయకత్వం ఎంతో గొప్పదని, ప్రజలకు సేవ చేసే నాయకులను ఎన్నుకుంటే ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. పట్టణంలో ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నామని, పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని తెలిపారు.

*పాయకరావుపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం*

పట్టణంలోని దుర్గా కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పాయకరావుపేటలో రామాలయంతో పాటు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని, అంబేద్కర్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దుర్గా కాలనీ, ఇందిరా కాలనీ, రాజీవ్ కాలనీల అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పాయకరావుపేట పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని హోంమంత్రి అనిత ప్రజలను కోరారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X