Wednesday, 26 August 2026
Telugu Daily
BREAKING

కోటిరెడ్డి దంపతుల అరెస్ట్‌పై విడదల రజిని ఆగ్రహం

పరామర్శ

చిలకలూరిపేట. ఆగస్టు 24 రాజధాని వాయిస్ : ఓ కేసులో అరెస్టై వైద్య పరీక్షల నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సింగారెడ్డి కోటిరెడ్డి (75), ఆయన భార్య లక్ష్మి (70)లను మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా విడదల రజిని మాట్లాడుతూ, వృద్ధ దంపతులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోటిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరుస కేసులతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఈ కేసులపై న్యాయపరంగా పోరాడి వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తామని స్పష్టం చేశారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!