చిలకలూరిపేట.
రాజధాని వాయిస్ :
చిలకలూరిపేట రూరల్ మండలం కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త యంపరాల అప్పారావు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని ఆదివారం వారి నివాసానికి చేరుకుని, అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!