చిలకలూరిపేట.
సెప్టెంబర్ 17
రాజధాని వాయిస్ :
మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని విడదల రజిని సూచించారు.
అనంతరం పార్టీలో వివిధ హోదాల్లో నియమితులైన నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని విడదల రజిని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయ భాస్కర రెడ్డి, మండల మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!