Tuesday, 20 October 2026
Header1
BREAKING

స్థానిక ఎన్నికల సమరానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి

మాజీ మంత్రి విడదల రజిని పిలుపు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 10 Sep 2026, 10:24 AM
🔄 నవీకరణ: 12 Oct 2026, 04:17 AM
👁️ 309 views
1004058110.jpg
Type image caption here...


చిలకలూరిపేట. 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి, ప్రతి గ్రామం మరియు ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ తిరుగులేని బలాన్ని చాటాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు. చిలకలూరిపేటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, కష్టకాలంలో సైతం అంకితభావంతో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికీ నాయకత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేస్తూ పార్టీ విజయానికి బాటలు వేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X