Tuesday, 20 October 2026
Header1
BREAKING

మెగా డీఎస్సీ పై వైసీపీ తప్పుడు ప్రచారం

16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 08 Sep 2026, 05:29 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 20 views
Story Highlights

మాచర్ల సెప్టెంబర్ 08 రాజధాని వాయిస్ :

మెగా డీఎస్సీ అభ్యర్థుల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను నట్టేట ముంచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన హామీ మేరకు కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశారని తెలిపారు.

డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు వైసీపీ అనేక పిటిషన్లు వేయించినప్పటికీ, న్యాయస్థానాల్లో అవి నిలబడలేదన్నారు. యువత ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగాలను చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, యువతకు ఉపాధి అవకాశాలు దూరమయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలను అమలు చేస్తోందన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X