Tuesday, 20 October 2026
Header1
BREAKING

దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో రూ. 49.61 కోట్లతో ‘అమృత్ 2.0’....

తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన ఎంపీ , లావు ఎమ్మెల్యే యరపతినేని...

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 05:13 PM
🔄 నవీకరణ: 07 Oct 2026, 10:58 AM
👁️ 10 views
దాచేపల్లి. సెప్టెంబర్ 04

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం
దాచేపల్లి నగర పంచాయతీ ప్రజల తాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చేందుకు రూ. 49.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘అమృత్ 2.0’ (AMRUT 2.0) మంచి నీటి పథకానికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు , స్థానిక శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు  శంకుస్థాపన చేశారు.
దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచి నీటిని అందించేందుకు ఈ ‘అమృత్ 2.0’ పథకం ఎంతో దోహదపడుతుందని ఎంపీ అన్నారు. గురజాల, మాచర్ల రెండు నియోజకవర్గాల పరిధిలో వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ మంచినీరు అందించేందుకు రూ. 1,200 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
"దాచేపల్లిలో మొత్తం 12 వేల ఇళ్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 3,100 ఇళ్లకు మాత్రమే నీటి కనెక్షన్ ఉంది. అమృత్ 2.0 ద్వారా కొత్తగా మరో 4,300 ఇళ్లకు కనెక్షన్లు అందించడమే కాకుండా, పాత 3,100 కనెక్షన్లతో కలిపి మొత్తం 7,400 పైగా గృహాలకు తాగునీటి సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటివరకు సరైన వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల బోర్లు, గ్రౌండ్ వాటర్ ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేసేవారు. ఇప్పుడు బుగ్గవాగును ప్రధాన వనరుగా తీసుకుని ప్రతి ఇంటికీ ఆన్-డిమాండ్ మంచినీటిని అందిస్తాం.." అని  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

ముఖ్యమంత్రికి, పురపాలక శాఖ మంత్రికి కృతజ్ఞతలు

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 800 కోట్లు మంజూరు చేసినందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, పురపాలక శాఖ మంత్రి నారాయణకి. ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X