Tuesday, 20 October 2026
Header1
BREAKING

వివేకానంద స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి నాంది పలకాలి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 11 Sep 2026, 04:33 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 6 views
మాచర్ల సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్ :
మాచర్ల మండలం కంభంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు నైతిక,ఆధ్యాత్మిక విలువలపై పరీక్షలు నిర్వహిస్తున్న శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి. 1893 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో ప్రసంగించిన రోజుని పురస్కరించుకొని శ్రీరామ సమితి మాచర్ల వారీ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు వివేకానంద ఫర్ యూత్ అనే పుస్తకం ఆధారంగా మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలో పరీక్షలు నిర్వహించినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో మాట్లాడుతూ ముందుగా అమెరికా దేశపు సోదర ,సోదరీ మణులారా అని ప్రసంగించగానే ప్రపంచ దేశాల సభ్యులందరూ ఉవ్వెత్తిన రెండు నిమిషాల పాటు చప్పట్లుతో హర్షాదిరేఖలు వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రసంగించిన అనేకమంది వక్తలు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాత్రమే సంబోధించి తమ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తం చేశారు. కానీ స్వామి వివేకానంద ప్రపంచం లోఉన్న ప్రతి ఒక్కరిని సోదరీ సోదరులాగా భావించి జీవనయానం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆయన ముఖ్యంగా అమెరికాలో ప్రసంగించిన అంశాలు ఒకటి సర్వమత సామరస్యం ఇంకొకటి సర్వమానవాళి శ్రేయస్సు అనే రెండు అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రసంగించారు. ఆయన ప్రసంగాలకు ప్రపంచ దేశాలు లోని మేధావులు ఆశ్చర్యములతో మునిగిపోయారు. అమెరికా దేశంలోని పత్రికలన్నీ కూడా భారతదేశ సింహం అని ,భారతీయ వీర నరేంద్రుడిని కొనియాడారు. అప్పటివరకు భారతదేశమంటే నాగరికత లేని దేశం అని రాయిరప్పలకు పూజలు చేస్తూ ఉంటారని, మూఢనమ్మకాల దేశం అని అపోహతో ఉండేవారు. కానీ స్వామి వివేకానంద ప్రసంగం వినగానే ఇలాంటి మహానుభావుడు భారతదేశం లో ఉన్నాడని సంబరాశ్చర్యాలతో మునిగిపోయారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను అప్పుడు ప్రపంచ దేశాలు గుర్తించాయి. కాబట్టి విద్యార్థిని, విద్యార్థులు స్వామి వివేకానంద ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోకుండా మీరు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆ మహానుభావుడు కలల కన్నా నవభారత నిర్మాణానికి నాంది పలకాలని మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం వివేకానంద ఫర్ యూత్ బుక్ ఆధారంగా విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం సైదమ్మ, ఉపాధ్యాయులు , విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X