Tuesday, 20 October 2026
Header1
BREAKING

కార్యకర్తలకు అండగా ఉంటాం..

జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలదే కీలక పాత్ర

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 యడ్లపాడు
📅 ప్రచురణ: 19 Sep 2026, 01:01 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 549 views
Story Highlights
ప్రతి చోట పోటీ చేయాల్సిందే..
రాజీ అనే మాటే నియోజకవర్గంలో వినపడకూడదు
మాజీ మంత్రి విడదల రజిని 
యడ్లపాడు: 

యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో మాజీ మంత్రి  విడదల రజిని ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 

1004127805.jpg
Type image caption here...



ఈ సందర్భంగా విడదల రజిని  మాట్లాడుతూ,
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరసన్నద్ధం కావాలని, పార్టీ కోసం కష్టకాలంలో నిలబడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని రజిని  అన్నారు. “ప్రతి చోట మనం పోటీ చేయాల్సిందే.. రాజీ అనే మాటే నియోజకవర్గంలో వినపడకూడదు. మీలో ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను అక్కడికి వస్తాను” అని తెలిపారు.నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని తెలిపారు.
ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలదే కీలక పాత్ర ఉంటుందని తెలిపారు. కార్యకర్తలకు మంచి చేస్తూ, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ జగనన్న 2.0 పాలన సాగుతుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త సేవలను గుర్తించి, వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని విడదల రజిని  సూచించారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపు మనదే అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
1004127796.jpg
Type image caption here...



అనంతరం పార్టీలో వివిధ హోదాల్లో నియమితులైన నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విడదల రజిని గారు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయ భాస్కర్ రెడ్డి , యడ్లపాడు మండల నాయకులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో నియమితులైన నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X