Tuesday, 20 October 2026
Header1
BREAKING

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

- స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ పోటీ చేయాలి: మాజీ మంత్రి విడదల రజిని

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Sep 2026, 10:36 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 166 views

చిలకలూరి పేట సెప్టెంబర్ 21 రాజధాని వాయిస్ :

నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ,
పార్టీ కోసం కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ అండగా ఉంటుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థులు పోటీ చేసేలా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి చోటా పోటీ చేయాలి.
WhatsApp Image 2026-09-21 at 10.30.20 AM (1).jpeg

రాజీ అనే మాటకు తావుండకూడదు. కార్యకర్తలకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే నేను స్వయంగా అక్కడికి వచ్చి అండగా నిలబడతాను” అని విడదల రజిని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.
WhatsApp Image 2026-09-21 at 10.30.21 AM.jpeg

జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలదే కీలక పాత్ర ఉంటుందని విడదల రజిని పేర్కొన్నారు.

పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్త సేవలను గుర్తించి, వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పించే విధంగా ముందుకు సాగుతామని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
అనంతరం పార్టీలో వివిధ హోదాల్లో నియమితులైన నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయ భాస్కర్ రెడ్డి, నాదెండ్ల మండల నాయకులు, గ్రామాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో నియమితులైన నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X