Tuesday, 20 October 2026
Header1
BREAKING

రెండేళ్ల కూటమి పాలనలో 8 లక్షల ఉద్యోగాలు కల్పించాం

- ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 15 Sep 2026, 07:51 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 123 views

అమరావతి:

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఇప్పటికే దాదాపు 8 లక్షల ఉద్యోగాలను కల్పించామని ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మెగా డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు, ఎంఎస్‌ఎంఈ, స్కిల్ డెవలప్‌మెంట్, ఐటీ, పర్యాటక రంగాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. లోకేష్ నాయకత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాల కల్పన శూన్యమని, నిరుద్యోగంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని ఆరోపించారు. ఎన్‌సిఆర్‌బి నివేదికల ప్రకారం గతంలో వేలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోయేలా పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. గత హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పత్రాలను ప్రైవేట్ ప్రాంతాలకు తరలించి మూల్యాంకనం చేయించారన్న అంశాలు దర్యాప్తులో వెలుగు చూశాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ఉద్యోగ కల్పన కార్యక్రమాలు, మెగా డీఎస్సీలో పాటిస్తున్న పారదర్శకతను క్షేత్రస్థాయిలో వివరించేందుకు ఈ నెల 16 నుంచి 29 వరకు ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులంతా విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి యువతకు వాస్తవాలు వివరిస్తారని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X