నరసరావుపేట.
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిల్పకళ, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలు, వాస్తు శాస్త్రానికి ఆద్యుడైన విశ్వకర్మ నిర్మాణాల రూపకల్పనలో శాస్త్రీయత, సౌందర్యం, సమతుల్యతకు పెద్దపీట వేశారని కొనియాడారు. "డివైన్ ఇంజనీర్"గా గుర్తింపు పొందిన విశ్వకర్మ సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యాలకు ప్రతీక అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసు విభాగంలో విశేష సేవలందిస్తున్న సాంకేతిక, మోటార్ వాహన విభాగాల ఉద్యోగులకు ఈ వేడుకలు నూతన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (వెల్ఫేర్) గోపీనాథ్ తో పాటు పలువురు పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొని విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Be the first to share your thoughts on this story!