వెల్దుర్తి సెప్టెంబర్ 13 రాజధాని వాయిస్ :
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నూతనంగా ప్రారంభించిన మహాత్మజ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల నందు 2026- 2027 విద్యా సంవత్సరానికి 5, 6,7,8 వ తరగతుల ప్రవేశాల కొరకు అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోగలరని జిల్లా కన్వీనర్ పరమేశ్వరరావు, ప్రిన్సిపల్ రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెల్లరేషను కార్డు కలిగి, ఆధార్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికెట్ తో జత పరుస్తూ, పూర్తి చిరునామాతో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో, అప్లికేషన్ అందించాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని వివరించారు. పూర్తి వివరాలకు 9010723711 , 9014348654, 8317596367 సంప్రదించాలని కోరారు.
Be the first to share your thoughts on this story!