Tuesday, 20 October 2026
Header1
BREAKING

ల్యాబ్ లేటరీలను ప్రారంభించిన కేంద్ర మంత్రి నడ్డా

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 12 Sep 2026, 03:28 PM
🔄 నవీకరణ: 20 Oct 2026, 02:47 AM
👁️ 141 views

ల్యాబరేటరీలను వర్చువల్ గా ప్రారంభించిన సిఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నడ్డా

నరసరావుపేట.సెప్టెంబరు 12,రాజధాని వాయిస్:

రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. విజయవాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి క్రిటికల్ కేర్ బ్లాకులు,ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను ప్రారంభించిన జేపీ నడ్డా .రూ.249 కోట్ల వ్యయంతో 22 ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు.క్రిటికల్ కేర్ యూనిట్ల ద్వారా అందుబాటులోకి వచ్చిన 500 క్రిటికల్ కేర్ బెడ్లు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్‌తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు.
నరసరావుపేట ఏరియా హాస్పిటల్‌లో ఆధునిక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ప్రారంభం. లింగంగుంట్ల ఏరియా హాస్పిటల్‌లో రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X