మాచర్ల సెప్టెంబర్ 10 రాజధాని వాయిస్
పల్నాడు జిల్లా,మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల చిన్న మల్లయ్య (45) ద్విచక్ర వాహనంపై మాచర్ల వైపు వెళ్తుండగా,తుమృకోట గ్రామానికి చెందిన మద్దిపట్ల సైదయ్య మాచర్ల నుంచి జమ్మలమడక వైపు వస్తున్నాడు.ఈ క్రమంలో జమ్మలమడక వెళ్లే రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదం తీవ్రంగా ఉండటంతో కూరాకుల చిన్న మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.మరో ద్విచక్ర వాహనదారుడు మద్దిపట్ల సైదయ్య తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న మాచర్ల రూరల్ ఎస్సై వెంకట్రావు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలించారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Be the first to share your thoughts on this story!