Tuesday, 20 October 2026
Header1
BREAKING

నిజం గెలిచింది

- <span style="font-size: 14px;"><span style="font-size: 13px;">చంద్రబాబు అరెస్ట్‌ను గుర్తుచేసుకుంటూ నారా లోకేష్ భావోద్వేగ సందేశం</span></span>

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మంగళగిరి.
📅 ప్రచురణ: 09 Sep 2026, 09:59 AM
🔄 నవీకరణ: 12 Oct 2026, 04:02 PM
👁️ 16 views

మంగళగిరి. (రాజధాని వాయిస్) :రాజకీయ కక్షసాధింపులు, కుట్రలతో ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున నాటి ప్రభుత్వం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిర్బంధించిన చీకటి రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

WhatsApp Image 2026-09-09 at 9.56.32 AM (1).jpeg
Type image caption here...

ఆనాడు చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ దాదాపు 53 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఏకతాటిపై నిలిచి "నిజం గెలవాలి" అంటూ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని లోకేష్ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు కేసులతో నాయకుడి స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాలు వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి ఆయా ఆరోపణలను కొట్టివేయడంతో సత్యం నిగ్గుతేలిందన్నారు. కష్టకాలంలో చంద్రబాబు నాయుడికి అండగా నిలిచి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తిన తెలుగు ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసమే చివరకు ప్రజాస్వామ్యాన్ని, నిజాన్ని గెలిపించిందని లోకేష్ వివరించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X