Tuesday, 20 October 2026
Header1
BREAKING

వీరయోధుడు వడ్డే ఓబన్నకు ఘన నివాళులు

- బీజేపీ మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 06 Oct 2026, 11:15 AM
🔄 నవీకరణ: 10 Oct 2026, 01:14 PM
👁️ 8 views

మాచర్ల: అక్టోబర్ 06 రాజధాని వాయిస్ :

దేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యసాహసాలతో పోరాడిన వీరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా మాచర్లలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం, ప్రదర్శించిన ధైర్యం, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయన త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. దేశభక్తి, ధైర్యం, సేవాభావంతో కూడిన వడ్డే ఓబన్న జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వడ్డే ఓబన్న ఆశయాలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X