Tuesday, 20 October 2026
Header1
BREAKING

వాసవి యూత్ ఆధ్వర్యంలో తహశీల్దార్ వర కుమార్‌కు

ఘన సత్కారం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 16 Sep 2026, 08:18 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 629 views

దుర్గి. సెప్టెంబర్ 16

దుర్గిలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గి మండల తహశీల్దార్ వర కుమార్‌ను నిర్వాహకులు
ముఖ్య అతిథిగా సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, వినాయకుడి ప్రతిమను బహూకరించి వాసవి యూత్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ, పదేళ్లకు పైగా ఎంతో భక్తిశ్రద్ధలతో, నిరంతరాయంగా ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకుల కృషిని కొనియాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ సభ్యులు కపిలవాయి శ్రీనివాసరావు (టెంపర్), ఓబుల శెట్టి లక్ష్మీనారాయణ, దేవరశెట్టి రామారావు, కాసుల మురళి, చిన్ని రామకృష్ణ, శ్రీనివాసరావుతో పాటు ఇతర సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X