పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు భద్రతను, బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, ప్రజలకు మరియు అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
Be the first to share your thoughts on this story!