*పిడుగుపాటుతో నలుగురు మృతి*
*బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు*
నరసరావుపేట, సెప్టెంబర్ 13,రాజధాని వాయిస్:
నరసరావుపేట మండల పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి.పిడుగుపాటుకు నలుగురు మృతి చెందగా మరోవైపు భారీ వర్షాల కారణంగా ఆస్తి నష్టం సంభవించింది. సంఘటనల గురించి తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆదివారం ఉదయం ఆయా గ్రామాల్లోని బాధిత కుటుంబాలనుపరామర్శించారు.పిడుగుపాటుకు మృతి చెందిన వారి భౌతిక దేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నరసరావుపేట మండలంలోని యక్కలవారిపాలెం గ్రామానికి చెందిన రైతు మజ్జిగ చిన్న కోటేశ్వరరావు,పెట్టురివారిపాలెం గ్రామానికి చెందిన రాంచీ సంపూర్ణం, కల్పతోటి నాగమ్మ, పాలపాడు గ్రామానికి చెందిన డేరంగుల వెంకటయ్య పిడుగుపాటు కారణంగా మృతి చెందినట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రమాద/విపత్తు సహాయ పరిహారం, అర్హతగల ఇతర ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన అందించాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, నరసరావుపేట తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు.
ఆటోలు ధ్వంసం
పెట్టురివారిపాలెం గ్రామంలో భారీ వర్షం, పిడుగుపాటు కారణంగా వేపచెట్టు కూలిపోవడంతో పిట్టల బ్రహ్మయ్య, పిట్టల కోటేశ్వరరావుకు చెందిన ఆటోలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో వారి జీవనోపాధికి సంబంధించిన వాహనాలు దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయారు.ఆస్తి నష్టాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హమైన పరిహారం లేదా ఆర్థిక సహాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Be the first to share your thoughts on this story!