Tuesday, 20 October 2026
Header1
BREAKING

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

- పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 11 Sep 2026, 02:47 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 132 views
నరసరావు పేట  సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్ :
నరసరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పల్నాడు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (పరిపాలన) రోహిత్ కుమార్ చౌదరి ఘనంగా ప్రారంభించారు.
WhatsApp Image 2026-09-11 at 2.41.22 PM.jpeg

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాసేవకే ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు స్వచ్ఛంద రక్తదానం ఎంతో దోహదపడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకోగా, వారిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
WhatsApp Image 2026-09-11 at 2.41.21 PM.jpeg
భారత రెడ్‌క్రాస్ సంస్థ, నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి వైద్య బృందం సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి, సంక్షేమ విభాగం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్, హోంగార్డ్స్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. కృష్ణ, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ యువరాజ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజా మరియు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X