- 29, 30 వార్డులను జల్లెడ పట్టిన పోలీసు బలగాలు
- సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు సీజ్
- రౌడీషీటర్లు, పాత నేరస్థుల ఇళ్లలో ముమ్మర తనిఖీలు
- అసాంఘిక శక్తులకు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు హెచ్చరిక
మాచర్ల అక్టోబర్ 10 రాజధాని వాయిస్ :
పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల నిర్మూలనే లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు శనివారం ఉదయం విస్తృత స్థాయిలో 'కార్డన్ & సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 29, 30 వార్డులను పోలీసు బలగాలు జల్లెడ పట్టాయి.
శనివారం తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వార్డుల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణగా పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హితవు పలికారు. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, కాలనీల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పాత నేరస్థులు పంథా మార్చుకుని సత్ప్రవర్తనతో జీవించాలని, అకారణంగా గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల టౌన్ సీఐ నజీర్ బేగ్, రూరల్ సీఐ వేణు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- 29, 30 వార్డులను జల్లెడ పట్టిన పోలీసు బలగాలు - సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు సీజ్ - రౌడీషీటర్లు, పాత నేరస్థుల ఇళ్లలో ముమ్మర తనిఖీలు - అసాంఘిక శక్తులకు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు హెచ్చరిక
మాచర్ల అక్టోబర్ 10 రాజధాని వాయిస్ :
పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల నిర్మూలనే లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు శనివారం ఉదయం విస్తృత స్థాయిలో 'కార్డన్ & సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 29, 30 వార్డులను పోలీసు బలగాలు జల్లెడ పట్టాయి.
శనివారం తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వార్డుల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణగా పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హితవు పలికారు. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, కాలనీల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
పాత నేరస్థులు పంథా మార్చుకుని సత్ప్రవర్తనతో జీవించాలని, అకారణంగా గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల టౌన్ సీఐ నజీర్ బేగ్, రూరల్ సీఐ వేణు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!