మాచర్ల సెప్టెంబర్ 12 రాజధాని వాయిస్ :
మీసం మెలేసి సవాల్ చేస్తున్న మాచర్ల నియోజకవర్గంలో రెండేళ్ల కూటమి పాలనకు..ఐదేళ్లు సాగించిన వైసీపీ రాక్షస పాలనపై చర్చకు సిద్దామా అంటూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే జూలకంటి ధ్వజమెత్తారు. శనివారం నెహ్రునగర్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణంపై అసత్య ప్రచారాలు మానుకుని.., మాగాడివైతే.. నీకు దమ్ముంటే మీ హయంలో తెచ్చిన అనుమతులతో నువ్వు రా.., మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన అనుమతులు.., ఇచ్చిన నిధులతో నేను వస్తా.. రైతుల సమక్షంలో చర్చకు కుర్చుంద్దామని తెగేసి చెప్పారు. అటవీశాఖ అనుమతులు వస్తే సరిపోవు అని.., పర్యావరణ, కృష్ణా రివర్ బోర్డు, పక్క రాష్ట్రాల అంగీకార పత్రాలు, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు ఇలా అనేక అనుమతులను దాటుకుని ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే ఫారెస్ట్ క్లియరెన్స్ కు రూ. 14.05 కోట్లు.., భూ సేకరణకు రూ.63.14 కోట్ల నిధులును ప్రాధమికంగా ఖర్చు చేశామన్నారు. భూటకపు భూమి పూజలతో, శంకుస్ధాపనలతో రెండు దశాబ్ధాలుగా నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలను వంచించిన నీచుడెవరో అందిరికీ తెలుసన్నారు. రైతుల కోసం జూలకంటి దుర్గాంబ జెర్రివాగు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే.., వ్యాపార వనరుగా మల్చుకుని నీళ్ల అమ్ముకున్న ఘనుడివి నువ్వు కాదా పిన్నెల్లి అని ఆరోపించారు. అనుపు, కొప్పునూరు, ధర్మవరం , పేటసన్నెగండ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలన పెట్టి, కమిషన్ల కోసం కక్కుర్తిపడింది నీవు కాదా కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రూ.850 కోట్లతో జల్ జీవన్ మిషన్, రూ. 160 కోట్లతో అమృత్ స్కీం పథకాలు ద్వారా గ్రామీణ, పట్టణ తాగునీటికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఒక్కసారి గ్రామాల్లోకి తిరిగితే అర్థమౌతోందని పేర్కొన్నారు. మాటలతో మభ్యపెట్టడాలు, భుజాలు నిమిరి గొంతులు కొయ్యడం తనకు చేతకాదని, నవులూరి చెన్నారెడ్డిని నమిలిమింగింది ఎవరో ప్రజలందరికీ తెలుసున్నారు. కష్టపడి పని చేసిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలందరికీ తగిని న్యాయం చేస్తానని.., అది నీలాంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తులు విమర్శిస్తే తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
స్ధానిక ఎన్నికల్లో రౌడీయిజం చూపితే తాటతీస్తాం..!
రానున్న స్ధానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో రౌడీయిజం చేయాలని చూస్తే తాటతీస్తామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, వైసీపీ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి హెచ్చరించారు. రెచ్చిపోయి, ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తే.., చూస్తూ ఊరుకోమని.., చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గుండాయిజానికి వచ్చినా.., రౌడీలతో వచ్చినా .. భయపడేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనే తమకు విజయం తెచ్చిపెడుతోందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, రాష్ట్ర, జాతీయ రోడ్లు , డ్రైనేజీలు, పట్టణ సివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యా, వైద్యం వంటి వాటికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తూ.., అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోతున్నామన్నారు.
అభివృద్ధికి పెద్దపీట.. అరాచకంపై ఉక్కుపాదం..!
మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. అరాచకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎమ్మెల్యే జూలకంటి చెప్పారు. కూటమి పార్టీలు వారు, వైసీపీ, ఇతర వర్గాలు వారు ఎవరైనా, ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నా.. వారి వద్ద నుంచి సింగిల్ పైసా కూడా కమిషన్ ను ఆశించేది లేదని పేర్కొన్నారు. మీ హయంలో ఏ విధంగా దోచుకున్నారో నిరూపితమైయ్యాయని వివరించారు. తాగు,సాగు, రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టుల అభివృద్ధి.., ఉద్యోగం, ఉపాధి, పారిశ్రామీకరణ వంటి అనేక రంగాలకు ఊతం ఇచ్చేలా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పాలనను సాగిస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు పంగులూరి అంజయ్య, కజ్జం సైదయ్య, రాజబోయిన మధు, కళ్లం రామాంజిరెడ్డి, యెనుముల కేశవరెడ్డి, కొమెర దుర్గారావు, మాచర్ల వాసు, వజ్రం నాయక్, మంజుల వెంకటేశ్వర్లు, బత్తుల అంకమరావు, కాంతి కుమార్, లాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!