గుంటూరు, సెప్టెంబర్ 18 :
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. వేదిక ఏర్పాటు, పార్కింగ్, ముఖ్య అతిథులు కూర్చునే స్థలాలు, వచ్చే ప్రజానీకం కూర్చునే ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. తాగు నీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం మధ్యాహ్నం ఉండే అవకాశాలు ఉన్నాయని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
అక్టోబర్ మొదటి వారం నాటికి భూ సమీకరణ పూర్తి చేయాలి
రాజధాని భూ సమీకరణ ప్రక్రియ అక్టోబర్ మొదటి వారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూ సమీకరణపై సంబంధిత డిప్యూటీ కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. భూమిని భౌతికంగా పరిశీలించి ఆ మేరకు సమీకరణ చేయాలని సూచించారు. భూ సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ ఏ.భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి, డి.ఎస్.పి మురళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!