Tuesday, 20 October 2026
Header1
BREAKING

పూర్వీకుల భూమిని కాపాడాలంటూ బాధితుడి విజ్ఞప్తి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 06 Oct 2026, 06:02 AM
🔄 నవీకరణ: 09 Oct 2026, 02:57 AM
👁️ 14 views

మాచర్ల, అక్టోబర్ 6 – రాజధాని వాయిస్:

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఎస్‌టీ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు, తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పాలకుర్తి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నంబర్ 1072లో తమకు సంబంధించిన భూమి ఉండగా, కుటుంబ అవసరాల నిమిత్తం కొంత భూమిని రూ.75 వేలకే విక్రయించినట్లు తెలిపారు. మిగిలిన భూమికి సంబంధించి తమ పేరు 1-బి అడంగల్‌లో నమోదు చేసి, పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.

అలాగే సర్వే నంబర్ 1073/1A1లో మొత్తం 1.74 ఎకరాల 87 సెంట్ల భూమికి సంబంధించి కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి, సుమారు నలుగురు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు.

పాలకుర్తి పెద్ద వెంకటేశ్వర్లు పేరుతో ఉన్న డాక్యుమెంట్ నంబర్ 76/1981లో 1.79 సెంట్ల భూమి తమ కుటుంబానికి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అని తెలిపారు. వీరయ్య, తిరుపతమ్మ కుటుంబానికి చెందిన ఈ ఆస్తిపై గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వే నంబర్ 1072కు సంబంధించి ఆన్‌లైన్ 1-బి అడంగల్‌లో మడతల రాజశేఖర్‌రెడ్డి పేరుతో 7.5 సెంట్లు, మడతల శ్రీనివాసరెడ్డి పేరుతో 12.5 సెంట్లు, ఉమాదేవి పేరుతో 11 సెంట్లు, సురేష్‌బాబు పేరుతో 5 సెంట్లు, తమ్మినేని కృష్ణారెడ్డి పేరుతో 6.5 సెంట్లు, మంగమ్మ పేరుతో 3.5 సెంట్లు, నాగిరెడ్డి వీరాంజనేయరెడ్డి పేరుతో 23 సెంట్లు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఈ నమోదులపై కూడా అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

తమకు సంబంధించిన భూమిలో సుమారు 75 సెంట్ల మేర ఆక్రమణకు గురైనట్లు పాలకుర్తి పెద్ద వెంకటేశ్వర్లు ఆరోపించారు. భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, హక్కులను నిర్ధారించి, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని పాలకుర్తి పెద్ద వెంకటేశ్వర్లు కోరారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X