వేద స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
చిలకలూరిపేట.సెప్టెంబర్ 5,రాజధాని వాయిస్:
పట్టణంలో స్థానిక వేద స్కూల్లో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి, ఉపాధ్యాయులకు పుష్పగుచ్చములతో మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీగిరి డేవిడ్ స్నేహల్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులు కరిగిపోతున్నా కొవ్వొత్తి లాంటివారని, విద్యార్థుల భవిష్యత్తుకు అహర్నిశలు కృషిచేసి వారి భావి భారత జీవితానికి మార్గదర్శకులు అవుతారని, అటువంటి ఉపాధ్యాయులను సత్కరించుకోవటం మనందరి బాధ్యత అని తెలిపారు. పాఠశాల సిఈఓ శామ్యూల్ రాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శవంతమైన వారని,ఈ సందర్భంగా భారత ప్రథమ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుగా మనం గుర్తుకు తెచ్చుకోవాలని, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఉపాధ్యాయులకు ఆదర్శవంతమైన నడవడిక అందించిన మార్గదర్శకులు సర్వేపల్లి, ఉపాధ్యాయులను గౌరవించుకోవటం వలన మనలను మనమే గౌరవించుకోవడం. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ సత్య దీప్తి ఉపాధ్యాయులందరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు దేశ అభివృద్ధికి మార్గదర్శకులు, ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి భావిభారత దేశ నిర్మాతలు అవడానికి కారకులు ఉపాధ్యాయులే, ఉపాధ్యాయులు లేనిదే దేశ నిర్మాణము జరగదు. ఒక తల్లి బిడ్డకు జన్మ ఇస్తుంది కానీ ఆ బిడ్డకు విజ్ఞానవంతమైన జీవితాన్ని వారి జీవితంలో వెలుగును నింపేటటువంటివారు ఉపాధ్యాయులు. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే జీవితాన్ని అందించే దివిటీ లాంటివారు ఉపాధ్యాయులు అందుకే గురువులను దైవముతో భావిస్తారు. గురువును బ్రహ్మ విష్ణు ఈశ్వరుడుతో భావిస్తారు. గురువు లేక చదువు గుడ్డు చదువు అంటారు.ఈ కార్యక్రమంలో సి ఈ ఓ శామ్యూల్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, కోఆర్డినేటర్ వర్షిత, జూనియర్ బ్లాక్ ఇన్చార్జ్ సౌజన్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!