Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఇంటింటికీ టీడీపీ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కజ్జం సైదయ్య

- 8వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 23 Sep 2026, 08:35 PM
🔄 నవీకరణ: 03 Oct 2026, 04:39 AM
👁️ 124 views



మాచర్ల  సెప్టెంబర్ 23 రాజధాని వాయిస్ :

మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. 8వ వార్డు ఇన్‌చార్జ్ కజ్జం సైదయ్య, 8వ వార్డు అధ్యక్షులు మద్దిగపు శ్రీనివాసు రెడ్డి (బుల్లి రెడ్డి), 8వ వార్డు ఉపాధ్యక్షులు వంకాయలపాటి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా 67వ బూత్ ఇన్‌చార్జ్ రాజీవ్ కుమార్ వంకాయలపాటి మాట్లాడుతూ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, ఆయా పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు.

అలాగే మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. వార్డులోని ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వార్డులో తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాజీవ్ కుమార్ వంకాయలపాటి తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జ్ పీట్ల బాబు, చల్లా సాంబ, చల్లా రాజారత్నం, వంకాయలపాటి కోటేశ్వరరావు, బత్తుల పిచ్చయ్య, నరేష్ ఓర్సు, మంజుల శ్యాంబాబుతో పాటు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X