కరాటే పోటీలలో వేద విద్యార్థుల ప్రతిభ
చిలకలూరిపేట.సెప్టెంబర్ 12,రాజధాని వాయిస్:
స్థానిక వేద స్కూల్ విద్యార్థులూఈనెల ఆరో తారీకు ఆదివారం దాచేపల్లిలో జరిగిన షుడోకాన్ ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో వేద విద్యార్థులు మన్నెం విజయశ్రీ మరియు మన్నెం ధనుష్ కుమార్ కరాటే పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు .ధనుష్ కుమార్ టీం కట కుముతే విభాగాలలో ఫస్ట్ సెకండ్ ప్లేసులలో అలాగే విజయశ్రీ కుముతే, టీం కట ఫస్ట్ సెకండ్ ప్లేస్ లను కైవసం చేసుకున్నారు. కరాటే పోటీలలో ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ శ్రీగిరి డేవిడ్ స్నేహల్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పాఠశాల సి ఈ ఓ శ్యామ్యూల్ రాజు విద్యార్థులు అభినందిస్తూ కరాటే శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని ,ఆత్మ రక్షణకు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. పాఠశాల అకడమిక్ డైరెక్టర్ సత్యదీప్తి విద్యార్థులను కరాటే నందు ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను అభినందిస్తూ విద్యతో పాటు కరాటే లో కూడా ప్రతిభలను కనపరుస్తున్న విద్యార్థులు ఇంకా ఎన్నో బహుమతులు గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, కోఆర్డినేటర్ వర్షిత, జూనియర్ బ్లాక్ ఇన్చార్జి సౌజన్య ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు.
Be the first to share your thoughts on this story!