Tuesday, 20 October 2026
Header1
BREAKING

లైన్‌మెన్ గోపాల్ ఆకస్మిక మృతి: అధికారుల నివాళులు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 11 Sep 2026, 03:11 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 543 views

దుర్గి సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్ :
దుర్గి  గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్‌మెన్  గోపాల్ గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ప్రస్తుతం కారంపూడిలో విధులు నిర్వహిస్తున్న ఆయన, 2004లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి నిరంతరం విధి నిర్వహణలో అందరి ఆదరాభిమానాలు పొందారు. ఆయన అకాల మరణం పట్ల మాచర్ల డీఈ సింగయ్య, ఏడీఈ ఆనందరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, గోపాల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
WhatsApp Image 2026-09-11 at 3.06.02 PM.jpeg

అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ. 25,000 నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఆల్ యూనియన్ నాయకులు, తోటి సిబ్బంది పాల్గొని కన్నీటి నివాళులర్పిస్తూ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X