Tuesday, 20 October 2026
Header1
BREAKING

పర్యాటకాభివృద్ధికి పటిష్టమైన అడుగులు..!

- ఎత్తిపోతల జలపాతానికి ప్రత్యేక ఆకర్షణగా జీప్ రైడ్..! - ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జూలకంటి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 09 Sep 2026, 05:20 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 190 views

మాచర్ల  రూరల్ సెప్టెంబర్ 09 రాజధాని వాయిస్:

కూటమి ప్రభుత్వ హయంలో పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలో పర్యాటకాభివృద్ధికి పటిష్టమైన అడుగులు పడుతున్నాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంరెడ్డి వెల్లడించారు. బుధవారం మండల పరిధిలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం వద్ద ఏపీ టూరిజం, రెయిన్ బో ఎంటర్టైన్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిప్ రైడ్, జిప్ సైక్లింగ్ కార్యకలపాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. సాహసవంతమైన రైడ్ ను పచ్చజెండా ఊపి, పర్యటకులను ప్రోత్సహించారు. అనంతరం గ్రామీణ బ్యాంకు వారి సౌజన్యంతో నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేయగా.. వాహనాలను ప్రారంభించారు.

చారిత్రాత్మక వారసత్వ సంపద అభివృద్ధే ధ్యేయం – ఎమ్మెల్యే జూలకంటి

WhatsApp Image 2026-09-09 at 3.24.41 PM (1).jpeg


చారిత్రాత్మక పల్నాడు ప్రాతంలో వారసత్వ సంపదను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే జూలకంటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సారధ్యంలో పర్యాటకాభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో విజపురిసౌత్ ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర.., ప్రభుత్వాలు భారీగా నిధులు మంజూరు చేస్తున్నాయని వెల్లడించారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద విజయపురిసౌత్ వద్ద రూ. 25 కోట్లతో బౌద్ధ వారసత్వం, సాంస్కృతిక అనుభవాన్ని పెంపొందించడానికి బెస్ట్ డిస్టినేషన్ డెవలప్మెంట్ గా ఈ ప్రాంతాన్ని పర్యటకంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.
WhatsApp Image 2026-09-09 at 3.24.43 PM.jpeg


సాగర్ వద్ద బౌద్ధ వారసత్వ కట్టడాలు, ఉద్యానవనాలు, చారిత్రాత్మక చిహ్నాల నిర్మాణం, అనుపు వద్ద పర్యాటక సదుపాయాల మెరుగుదల, 3డి హోలోగ్రామ్ సిస్టమ్, లైవ్ఇంటరాక్టివ్ టచ్ స్క్రీన్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తీసుకొచ్చిన పబ్లిక్.., ప్రైవేటు పార్నర్ షిప్ విధానంలో అన్నీ రంగాలు అభివృద్ధిని సాధిస్తున్నాయని,ఏపీ పర్యటకాభివృద్ధి శాఖ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం శుభపరిణామని అన్నారు. రెయిన్ బో ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎత్తపోతలలో రూ. 1 కోటి 71 లక్షలతో నిర్మించిన జిప్ రైడ్, జిప్ సైక్లింగ్ కార్యకలపాలను పర్యటకులు సద్వినియోగపర్చుకోవాలని కోరారు.

WhatsApp Image 2026-09-09 at 3.24.41 PM (2).jpeg


ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళీ, తహశీల్దార్ కిరణ్ కుమార్, టూరిజం డీఎం కృష్ణచైతన్య, డీటీవో నాయుడమ్మ, యూనిట్ మేనేజర్ బ్రహ్మాయ్య, రెయిన్ బో ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఖాజా మొయిద్దీన్, జెస్టిన్ జోసఫ్ , కూటమి పార్టీల నాయకులు గుండాల శ్రీను, రాజబోయిన మధు, వీరాస్వామి, సుధాకర్ రెడ్డి, సైదారావు,గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X