Tuesday, 20 October 2026
Header1
BREAKING

హెచ్‌ఐవీపై అవగాహనకు వీధి నాటకాల ప్రదర్శన

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 05:04 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 5 views

చిలకలూరిపేట సెప్టెంబర్ 04 రాజధాని వాయిస్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక క్యాంపు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 04 వ తారీకు ఉదయం 9:00 గంటలకు మార్కెట్ సెంటర్ నందు మిరియాల శ్రీనివాస్ రావు కళాజాత బృందాలతో వీధినాటకముల ద్వారా హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ వీధి నాటకములు ద్వారా హెచ్ ఐ వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ ఐ వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ ఐ వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ ఐ వి/ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండోమ్ యొక్క ఉపయోగం గురించి, హెచ్ ఐ వి/ఎయిడ్స్ ఆక్ట్ 2017 గురించి ప్రజలలో అవగాహనా కల్పించారు.సి హెచ్ సి సెంటర్ ఐ సి టి సి కౌన్సిలర్ హనుమంత్ రావు మరియు క్యాంపు స్వచ్చంద సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ మరియు ఎమ్ ఇ ఎ వి. శివ క్యాంపు ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X