Tuesday, 20 October 2026
Header1
BREAKING

తేరాల గ్రామంలో ఎస్సై పల్లెనిద్ర<div><br></div><div><br></div>

శాంతిభద్రతలపై ప్రజలకు దిశానిర్దేశం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 06 Sep 2026, 05:09 PM
🔄 నవీకరణ: 07 Oct 2026, 03:00 PM
👁️ 152 views
దుర్గి. సెప్టెంబర్ 06

 పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని తేరాల గ్రామంలో ఎస్సై బి గోపాల్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, రెవెన్యూ పరిధిలోని అంశాలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామస్తులనుద్దేశించి ఎస్సై మాట్లాడుతూ, గ్రామంలో అందరూ సోదరభావంతో మెలగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించరాదని హితవు పలికారు. చిన్నపాటి వివాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, లేనిపక్షంలో పోలీసులను ఆశ్రయించాలి తప్ప గొడవలు పడి కేసులతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. నేర చరిత్ర నమోదైతే ఆ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై తీవ్రంగా పడుతుందని గుర్తుచేశారు.
అలాగే సైబర్ నేరాలు, బ్యాంకింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే తక్షణమే '1930' టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, దొంగతనాల నివారణపై అవగాహన కల్పిస్తూ, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X